YS Jagan : వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
YS Jagan Mohan Reddy Has Received Relief From AP High Court
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీసులు జగన్ పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను అన్నింటినీ నిలుపుదల చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : AP Government : ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ శుభవార్త.. మూడు నెలల పాటూ పంపిణీ
మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్ పై ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు వైఎస్ జగన్ నిరసన కార్యక్రమం చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ పోలింగ్ రోజు జగన్ ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి పోలీసులు పంపించడం లేదని ఆరోపించారు. అంతేకాక.. వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. ఆయన అనుచరులు 70మందికి పైగా పులివెందుల మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు.. అక్కడే బైఠాయించారు. ఈ ఘటనపై ఎంఈవో రఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
పోలీసుల తరఫున పీపీ లక్ష్మీనారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని.. అనుమతి లేకుండా పిటిషనర్ ధర్నాకు దిగారని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 13 మంది సాక్షులను విచారణ చేశామన్నారు. వారంతా జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని కోర్టుకు తెలిపారు.
కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీసులు జగన్‌పై నమోదుచేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన ఎంఈవో రఫిక్‌కు నోటీసులు జారీచేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
