Bus Accident : సీఎం నివాసం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
Bus Accident In Punjab : పంజాబ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
Bus Accident In Punjab
Bus Accident In Punjab : పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24మంది గాయపడ్డారు. సంగ్రూర్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు సంగ్రూర్ నుంచి చండీగఢ్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read : Telangana Farmers : తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. 365 మండలాల్లో రుణాల వసూళ్లకు బ్రేక్!
బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో 15 మందిని మెరుగైన చికిత్స కోసం పాటియాలా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన తొమ్మిది మందికి సంగ్రూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు తొలుత ప్లైఓవర్‌కు దన్నుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తరువాత అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
