Yathindra Saptati Celebrations : అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ: చిన్న జీయర్ స్వామి
Yathindra Saptati Celebrations : అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు.
Chinna Jeeyar Swamy
Yathindra Saptati Celebrations : అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. సమాజ సంక్షేమం మనందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. సమస్త జీవరాశికి సేవ చేయడం అత్యున్నతమైన ధర్మమని బోధించారు. గుర్తింపు లభించకపోయినా నిస్వార్థంగా సేవ చేస్తున్న మహనీయుల సేవలు మరువలేనివని కొనియాడారు.
Also Read : Gold Silver Prices Today : కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..
ముచ్చింతల్లో చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశసేవ, సమాజసేవలో విశేష కృషి చేసిన 70 మంది సేవామూర్తులకు సమతా పురస్కారాలతో సత్కరించారు. ఈ పురస్కారాలను అందుకున్న వారి సేవలు ఎంతో ప్రశంసనీయమని చిన్న జీయర్ స్వామి అన్నారు. దేశానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ మంగళాశాసనాలు అందించారు. సేవామూర్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో ఎంతోమంది ఎలాంటి గుర్తింపు, ప్రతిఫలం ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. అలాంటి వారి సేవలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని, అవసరమైన సమయంలో వారికి తోడుగా నిలవడమే నిజమైన సేవాభావమని వివరించారు. మన చుట్టూ ఉన్నవారి సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 126 అడుగుల సమతామూర్తి విగ్రహం, 108 దివ్యదేశాల దర్శనం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు.
నేటి కార్యక్రమాలు ఇవే..
యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా ఉదయం 8.30 గంటలకు ధర్మగోష్ఠి నిర్వహించారు. ఉదయం 10 గంటలకు దేశసేవలో విశేష కృషి చేసిన 70 మంది త్యాగధనులకు సప్తతి పురస్కారాలు అందజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆచార్యసేవలో నిమగ్నమైన 70 మంది మాతృమూర్తులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు 33వ సహస్ర కలశాభిషేక మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో భక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
