Kulgam Attack: జమ్మూ కాశ్మీర్లో CRPF బలగాలపై ఉగ్రదాడి.. బైక్‌పై వచ్చి జవాన్లపై కాల్పులు
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా(Kulgam Attack) నాకా పాయింట్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Terrorists attack crpf jawans in jammu kashmir kulgam three injured
Kulgam Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. కుల్గాం(Kulgam Attack) జిల్లా అఖ్రాన్ సమీపంలో నాకా పాయింట్ వద్ద నిఘా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు జరిపిన ఆకస్మిక కాల్పుల్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎదురు కాల్పులు జరిపి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి.
Milk Price Hike: వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న పాల ధరలు.. ఏకంగా రూ.6 పెంపు!
ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు.. కుల్గాం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత:
కాల్పుల్లో గాయపడిన జవాన్లను అధికారులు వెంటనే అనంత్‌నాగ్ జిల్లాలోని సమీప మిలిటరీ ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి తీవ్ర కలకలం రేపడంతో కుల్గాం జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలు రెడ్ అలర్ట్ ప్రకటించి తనిఖీలను తీవ్రతరం చేశాయి. ఘటనా స్థలాన్ని సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని, పరారైన ఇద్దరు ముష్కరుల కోసం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి భారీ ఎత్తున గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) నిర్వహిస్తున్నారు.
