ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశాం: డీజీపీ రవి గుప్తా
DGP Ravi Gupta: తెలంగాణలో 500 రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ విభాగాలతో పాటు 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఉందని చెప్పారు.
రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలాలతో భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు.
తెలంగాణలో 500 రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ విభాగాలతో పాటు 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 7000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేశామని చెప్పారు. పెద్ద మొత్తం డబ్బు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఏపీ ఎన్నికల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read : వైసీపీ నేత శిల్పా రవి, అల్లు అర్జున్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీకి రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా?