Cooking Gas Saving Tips: ఎల్పీజీ సంక్షోభం.. గ్యాస్‌ను భారీగా ఆదా చేసుకోవడం ఎలా? సింపుల్ టిప్స్ మీ కోసం
చిన్న చిన్న టిప్స్ తో గ్యాస్ ను వినియోగదారులు భారీగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వంట గ్యాస్ ను పొదుపుగా వాడుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
Cooking Gas Saving Tips Representative Image (Image Credit To Original Source)
Cooking Gas Saving Tips: మిడిల్ ఈస్ట్ యుద్ధ భారం డైరెక్ట్ గా మన వంటింటిపై పడింది. దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నెలకొంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందక హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నారు. ఇక సమయానికి గ్యాస్ సిలిండర్లు రాక జనం సైతం ఆందోళన చెందుతున్నారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడం, ఆదా చేసుకోవడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ఎల్పీజీ సంక్షోభం..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పటికే భారతదేశం అంతటా రెస్టారెంట్లు, హోటళ్లను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఇక పీజీలు, హాస్టల్స్ లోనూ హాహాకారాలు మొదలయ్యాయి. గ్యాస్ కొరత కారణంగా ఫుడ్ మెనూలో పెను మార్పులు చేయాల్సి వస్తోంది. దోస, ఉతప్పం, చపాతీ, పూరీ వంటి గ్యాస్ అధికంగా అవసరం అయ్యే వంటకాలను బంద్ చేసేశారు.
ఈ పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న టిప్స్ తో గ్యాస్ ను వినియోగదారులు భారీగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వంట గ్యాస్ ను పొదుపుగా వాడుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చని సూచిస్తున్నారు. గ్యాస్ ను పొదుపుగా వాడుకునేలా, భారీగా ఆదా చేసేలా సింపుల్ టిప్స్ మీ కోసం..
గ్యాస్ ను భారీగా ఆదా చేసే సింపుల్ టిప్స్..
* వీలైనంత వరకు ఇండక్షన్ స్టవ్ లు వాడాలి
* కనీసం 50శాతం వంటలను ఇండక్షన్ స్టవ్ పై చేసేలా ప్లాన్ చేసుకోవాలి
* ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకం పెంచాలి
* రైస్ కుక్కర్ లో అన్నం మాత్రమే కాకుండా దాల్, కూరలు ఉడికించుకోవచ్చు
* పాలు, ఇతర పానీయాలు కాచేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ వాడకం మేలు
* కొంత కాలం డీప్ ఫ్రైలకు దూరంగా ఉండండి. బజ్జీలు, పకోడీలు, ఫ్రై వంటకాలను దూరం పెట్టండి
* ఎక్కువగా ప్రెషర్ కుక్కర్ తో వంటలు చేసుకోవాలి
* దాల్, మాంసాహారం వంటలకు ప్రెషర్ కుక్కర్ బెస్ట్
* పప్పు, రాజ్మా, శనగపప్పు, బంగాళాదుంపలు, కూరగాయలు ఓపెన్ ఫ్లేమ్ కంటే ప్రెజర్ కింద చాలా త్వరగా ఉడికిపోతాయి.
* బియ్యం, పులావ్ కూడా ప్రెజర్ కుక్కర్లో కొంత సమయంలోనే వండుకోవచ్చు.
* స్టవ్ ఆన్ చేయడానికి ముందే వంటకు అవసరమైన పదార్ధాలను సిద్ధం చేసుకోవాలి
* వంట చేసేటప్పుడు పాత్రలపై మూత తప్పనిసరిగా పెట్టాలి
* చిన్న బర్నర్ పై పెద్ద పాత్రలు, పెద్ద మంటపై చిన్న పాత్రలతో వంట చేయకూడదు
* బర్నర్ లను తరుచూ శుభ్రం చేయాలి
* గ్యాస్ లీకేజీపైనా దృష్టి పెట్టాలి
* ఫ్రిజ్ లో ఉన్న పదార్ధాలను నేరుగా గ్యాస్ పై పెట్టకూడదు. చల్లగా ఉన్న పదార్ధాలను కాసేపు బయటే ఉంచాలి
* రోజుకు చాలాసార్లు వంటలు వండడానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో తయారు చేయడానికి ప్రయత్నించాలి
* గ్రేవీలు, పప్పు, సాంబార్, చట్నీలు, కర్రీలను ఒకసారి ఉడికించి రిఫ్రిజిరేటర్లో ఉంచొచ్చు.
గ్యాస్ తక్కువగా అవసరమయ్యే, త్వరగా వండుకునే వంటకాలు చేసుకోవడం బెటర్..
ఉప్మా
లెమన్ రైస్
కర్డ్ రైస్
కూరగాయల అన్నం
ఆమ్లెట్, ఎగ్ బుర్జీ
* బీన్స్, చిక్పీస్ లేదా పప్పు కూరలు వండుతుంటే వాటిని ముందుగా నానబెట్టడం వల్ల చాలా తేడా ఉంటుంది. నానబెట్టిన పప్పులు ప్రెజర్ కుక్కర్లో వేగంగా ఉడికి, సులభంగా మెత్తబడతాయి. దీనివల్ల వంట సమయం గణనీయంగా తగ్గుతుంది. గ్యాస్ భారీగా ఆదా అవుతుంది.
ఇలా చిన్న చిన్న మార్పుల ద్వారా గ్యాస్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడం ద్వారా భారీగా ఆదా చేయొచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా గ్యాస్ తొందరగా అయిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు.
Also Read: ఏం స్కెచ్చేశార్రా.. సైబర్ నేరస్తుల సరికొత్త ప్లాన్.. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
