Cyber Crime: ఏం స్కెచ్చేశార్రా.. సైబర్ నేరస్తుల సరికొత్త ప్లాన్.. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తేల్చి చెప్పారు. నకిలీ వెబ్సైట్లతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Representative Image (Image Credit To Original Source)
- గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త సైబర్ మోసాలు
- సిలిండర్ కొరతను ఆసరాగా చేసుకుని దోపిడీ
- తక్షణ డెలివరీ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు
- వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులు
- ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యాస్ ఇస్తామని మోసం
Cyber Crime: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల కోసం జనాలు బాగా ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్నా సిలిండర్ వెంటనే రావడం లేదు. దీంతో వారిలో కంగారు పెరిగిపోతోంది. అసలు సిలిండర్ వస్తుందా రాదా అనే భయం నిద్ర లేకుండా చేస్తోంది. ఇలా గ్యాస్ బుక్ చేస్తే తొందరగా వచ్చేసేలా ఏదైనా సౌకర్యం ఉంటే బాగుండు అని కొందరు జనాలు అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త సైబర్ మోసాలకు తెరలేపారు. సిలిండర్ కొరతను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు.
తక్షణ డెలివరీ పేరుతో సైబర్ క్రిమినల్స్ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులు పంపుతున్నారు. ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యాస్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. అత్యవసర సరఫరా పేరుతో సైబర్ క్రిమినల్స్ అమాయకులను టార్గెట్ చేశారు. సైబర్ క్రిమినల్స్ మాయమాటలు నమ్మేసి పొరపాటున ఎవరైనా ఆ లింక్స్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. ఈ సైబర్ మోసం గురించి తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ మోసాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు చెప్పారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.
గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్లనే ఉపయోగించాలని సూచించారు. ఇక ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తేల్చి చెప్పారు. నకిలీ వెబ్సైట్లతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
Also Read: గ్యాస్ రేట్ల దెబ్బ.. హాస్టల్స్ లో మెనూలు మారిపోయాయ్.. ఓనర్ల కొత్త మెనూ
