Cm Chandrababu: 90 ఏళ్ల అవ్వ జీవితకాల కోరిక.. నేరుగా వచ్చి కల్సిన సీఎం చంద్రబాబు
సోషల్ మీడియా ద్వారా వచ్చిన వినతికి స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆమెను స్వయంగా కలిశారు చంద్రబాబు(Cm Chandrababu).
Ap cm chandrababu meets 90 year old elderly fan in chirala
- వృద్ధ అభిమానిని కలిసిన సీఎం
- పుష్పావతి జీవితకాల కల నెరవేరింది
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
Cm Chandrababu: ప్రజా నాయకులు తమ అభిమానులపై చూపే ఆప్యాయత వారికి మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటీవల తనను చూడాలని తపించిన ఓ వృద్ధురాలి కల నెరవేర్చి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వినతికి స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆమెను స్వయంగా కలిశారు.
Liquor Shops closed: హైదరాబాద్ మందుబాబులకు బిగ్ షాక్.. ఆ రోజు మద్యం షాపులు బంద్
చీరాల పర్యటనలో చిరస్మరణీయ ఘట్టం:
చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన 90 ఏళ్ల కొమ్మాలపాటి పుష్పావతి అనే వృద్ధురాలు సీఎం చంద్రబాబును(Cm Chandrababu) కలవడమే తన జీవితకాల కోరికని ఇటీవల సోషల్ మీడియాలో తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, ఆమెను త్వరలోనే కలుస్తానని మాటిచ్చారు. శుక్రవారం చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, ప్రత్యేకంగా పుష్పావతిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నెరవేరిన కల: సంతోషంలో వృద్ధురాలు:
అత్యంత అభిమానించే నాయకుడిని నేరుగా చూడటంతో పుష్పావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన జీవితకాల స్వప్నం నెరవేరిందంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన సన్నివేశానికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకోగా, అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
