Liquor Shops closed: హైదరాబాద్ మందుబాబులకు బిగ్ షాక్.. ఆ రోజు మద్యం షాపులు బంద్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపుల(Liquor Shops closed) మూసివేతపై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.
Bonalu festival liquor shops closed hyderabad on august 9th
- బోనాల వేళ మద్యం షాపులు బంద్
- ఆగస్టు తొమ్మిదిన ఆంక్షలు అమలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Liquor Shops closed: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతిరూపమైన బోనాల పండుగ వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపుల మూసివేతపై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవడానికి, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు యంత్రాంగం ఈ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968 ఆధారంగా సీపీ రమేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Ap Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష ముప్పు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఆగస్టు 9న వైన్ షాపులు బంద్:
ఆగస్టు 9, ఆదివారం రోజున ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు సైబరాబాద్‌లోని ఆరు ప్రధాన పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్ షాపులు(Liquor Shops closed), కల్లు కాంపౌండ్లు, బార్లు మూతపడనున్నాయి. కూకట్పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే స్టార్ హోటళ్లు, గుర్తింపు పొందిన క్లబ్‌లకు ఈ నిబంధనల నుండి మినహాయింపు లభించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:
పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికే ఈ ఆంక్షలు విధించినట్లు సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, భక్తులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
