Maha Lakshmi Scheme : మహిళలకు తెలంగాణ సర్కార్ బతుకమ్మ కానుకగా రూ.2500..? టీజీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..
Maha Lakshmi Scheme : బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై టీజీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.
Maha Lakshmi Scheme
Maha Lakshmi Scheme : తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి షురూ అయింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Peddapalli Politics : పెద్దపల్లి బీఆర్ఎస్లో పీక్స్‌కు రచ్చ.. మాజీ ఎమ్మెల్యే మనోహర్ వర్సెస్ బీసీ లీడర్స్..
ఈ వీడియోపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో మార్ఫింగ్ చేసిందని తెలిపింది. ఈ వీడియోలను నమ్మవద్దని, సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వం విడుదలచేసే వేదికల నుంచే తెలుసుకోవాలని సూచించింది.
తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వివరాల ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని ప్రకటించినట్లు ప్రచారం అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో. ఈ వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించినవి. అసలు వీడియోకుఉన్న ఆడియోను మార్చి, దాని స్థానంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేశారు. దీని ద్వారా, ముఖ్యమంత్రి రెండు పథకాల అమలును ప్రకటించినట్లు కనిపించేలా చేశారు.
ప్రచారంలో ఉన్న ఆడియోను ఏఐ డిటెక్షన్ పరికరాలు ద్వారా పరిశీలించగా, అది డీప్ ఫేక్ ఆడియో అని తేలింది. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విషయాలకోసం, కేవలం అధికారిక ప్రభుత్వ మాధ్యమాల ద్వారా విడుదలైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న ఏఐ వీడియోలు, ఆడియోలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్లో పేర్కొంది.
A video of the Telangana Chief Minister A Revanth Reddy announcing ₹2,500 monthly assistance for women and two tolas of gold under Kalyana Lakshmi from the Bathukamma festival, is a doctored video.
Facts:
➤ The video being circulated features Chief Minister A Revanth Reddy speaking at the 892nd Basava Jayanti celebrations held at Ravindra Bharathi, is from April 2025.
➤ The audio attached to the original video has been manipulated and replaced with AI-generated deepfake audio, making it appear as though the Chief Minister is announcing the implementation of the two schemes.
➤ AI-based audio detection tools used to examine the circulated audio have indicated that the audio is a deepfake.
➤ Any announcement regarding the implementation or expansion of government welfare schemes should be verified through official government communications.
➤ Citizens are advised not to rely on manipulated videos, AI-generated audio or social media posts for information about government schemes.
– Government of Telangana
— FactCheck_Telangana (@FactCheck_TG) October 7, 2026
