Telangana Government: జీఎస్టీ వ్యవస్థలో కీలక మార్పులు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. పన్ను ఎగవేతదారులకు చెక్
ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్న అడుగులు వేస్తోంది.
Telangana govt to use ai for gst tax evasion cm revanth reddy
- జీఎస్టీ వ్యవస్థలో ఏఐ వినియోగం
- పన్ను ఎగవేతకు పక్కా చెక్
- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Telangana Government: రాష్ట్రంలో పన్నుల వసూళ్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న అడుగులు వేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, ఆర్థిక నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.
ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో సీఎం భేటీ:
ఈ సాంకేతిక సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి(Telangana Government) ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో హైదరాబాద్‌లో కీలక చర్చలు జరిపారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో పన్నుల పర్యవేక్షణను ఏఐ ద్వారా కచ్చితంగా నిర్వహిస్తూనే, వ్యాపారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గకుండా చూడాలని సీఎం సూచించారు. భవన నిర్మాణాలు, కాంట్రాక్టు పనుల అనుమతుల సమయంలోనే సామగ్రి పన్ను అంచనాలను నమోదు చేసి, లీకేజీలను అరికట్టేలా డేటా విశ్లేషణ వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు.
శాఖల అనుసంధానం – పారదర్శక పరిపాలన:
మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల సమాచారాన్ని ఏఐ ద్వారా అనుసంధానించడం ద్వారా అక్రమాలను ముందే పసిగట్టవచ్చని ఈ భేటీలో నిర్ణయించారు. అంతేకాకుండా మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వంటి సంక్షేమ సేవలను ఈ సమీకృత డేటా వ్యవస్థకు జోడించడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
