Makutam Trailer : ‘మకుటం’ ట్రైలర్ వచ్చేసింది.. మూడు పాత్రల్లో విశాల్.. దర్శకుడిగా కూడా..
మీరు కూడా మకుటం ట్రైలర్ చూసేయండి..(Makutam Trailer)
Makutam Trailer
Makutam Trailer : విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న సినిమా ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో 99వ సినిమాగా స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. అంజలి, దుషార విజయన్, తంబి రామయ్య, జాన్ విజయ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మకుటం సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
మకుటం ట్రైలర్ చూస్తుంటే.. ఈ కథ రెండు కాలాల్లో జరగబోతుందని, విశాల్ ఓ పోర్ట్ లో చిన్నగా మొదలయి లీడర్ గా ఎదుగుతాడని తెలుస్తుంది. మరో పాత్ర ప్రస్తుతం ఒక మెడికల్ ఫీల్డ్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. విశాల్ ముసలి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్, యాక్షన్, భారీగా రక్తపాతం ఉండబోతుందని తెలుస్తుంది. మకుటం సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది.
Also Read : Nagavamsi : కలెక్షన్స్ అన్ని ఫేక్.. మళ్ళీ క్లారిటీ ఇచ్చిన నాగవంశీ.. ఫ్యాన్స్ ఇప్పటికైనా గొడవపడటం ఆపుతారా?
మీరు కూడా మకుటం ట్రైలర్ చూసేయండి..
