Nagavamsi : కలెక్షన్స్ అన్ని ఫేక్.. మళ్ళీ క్లారిటీ ఇచ్చిన నాగవంశీ.. ఫ్యాన్స్ ఇప్పటికైనా గొడవపడటం ఆపుతారా?
నిర్మాతలే స్వయంగా మేము వేసే కలెక్షన్స్ ఫేక్ అని చెప్తున్నా ఇంకా హీరోల అభిమానులు మా హీరోకు ఎక్కువ కలెక్షన్స్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేస్తారు.(Nagavamsi)
Nagavamsi
Nagavamsi : సినీ పరిశ్రమలో వేసే సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ అన్ని ఫేక్ అని, వచ్చే కలెక్షన్స్ కంటే ఎక్కువ వేస్తారు అని అందరికి తెలుసు. అయినా ఫ్యాన్స్ మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, మా హీరోకి ఎక్కువ వచ్చాయి అని ఫేక్ కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో కొట్టుకుంటారు. గతంలోనే నిర్మాత నాగవంశీ.. అవన్నీ ఫేక్, కేవలం ఫ్యాన్స్ కోసమే ఆ కలెక్షన్స్ పోస్టర్స్. రియల్ కలెక్షన్స్ కావు అని తను రిలీజ్ చేసిన ఓ స్టార్ హీరో సినిమా గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు.
ఇటీవల దిల్ రాజు కూడా.. సినిమా కలెక్షన్లకు, నిర్మాతలు వేస్తున్న పోస్టర్లకు సంబంధం లేదు. ఆ హీరో కంటే ఈ హీరోకి ఎక్కువ వేయాలని ఫ్యాన్స్ అంటారు. అందులో ఎంత నిజం కలెక్షన్స్ అనేది మాకు తెలుసు. ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు. ఇలా నిర్మాతలే స్వయంగా మేము వేసే కలెక్షన్స్ ఫేక్ అని చెప్తున్నా ఇంకా హీరోల అభిమానులు మా హీరోకు ఎక్కువ కలెక్షన్స్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేస్తారు.
తాజాగా నిర్మాత నాగవంశీ మరోసారి ఈ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి మాట్లాడారు. నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫేక్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో ఏ కలెక్షన్ పోస్టర్ కూడా నెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా బయటకు రాదు. ఇప్పటికి కూడా వచ్చే కలెక్షన్ పోస్టర్స్ అన్ని ఫేక్. దాన్ని ఆపే అవసరం ఏముంది. బుక్ మై షోలో లైక్స్ కూడా కొనుక్కుంటాము. ఫ్యాన్స్ కోసమే మేము ఆ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్నాం. వంద కలెక్ట్ చేస్తే 110 రూపాయలు వచ్చినట్టు చెప్తున్నాం. దాంతో ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు కదా.ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్స్ కి కూడా మేము వేసే పోస్టర్స్ అన్ని ఫేక్ అని తెలుసు. అందుకే మమ్మల్ని పోస్టర్స్ ఆధారమా ఇన్ కం అడగరు అని అన్నారు.
నిర్మాతలే స్వయంగా మేము వేస్తున్నవి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ అని చెప్తుంటే ఫ్యాన్స్ ఎప్పుడు ఈ కలెక్షన్స్ వార్స్ ఆపుతారో చూడాలి.
