Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల విద్వేషం, మత ఉన్మాదం/హింస తదితర సమస్యలతో బాధపడుతున్న బహుజనుల పరిస్థితిని బట్టి చూస్తే, బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలకు అది సాధ్యం కాదు

Mayawati: శుక్రవారం (జూన్ 23) బిహార్ రాజధాని పాట్నాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాల సమావేశంపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‭సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, విపక్షాలను ఏకం చేయడం మంచిదే కానీ, దాని ఉద్దేశాలేంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడంపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, వెనుకబాటుతనం, కుల విధ్వేషం వంటి వాటితో బహుజనులు (ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు) పడుతున్న ఇబ్బందులకు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయాల్సిన ఆవశ్యక్త ఉందని, అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఆ సామర్థ్యం లేదని మాయావతి స్పష్టం చేశారు.

CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయంను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ

ఈ విషయమై ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల విద్వేషం, మత ఉన్మాదం/హింస తదితర సమస్యలతో బాధపడుతున్న బహుజనుల పరిస్థితిని బట్టి చూస్తే, బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలకు అది సాధ్యం కాదు. అయితే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు జూన్ 23న నితీశ్ కుమార్ నిర్వహించబోయే విపక్ష పార్టీల సమావేశంలో లేవనెత్తే అంశాలను బట్టి చూస్తే ‘హృదయం కలిసినా కలవకపోయినా సరే కానీ ముందైతే చేతులు కలవాలి’ అన్నట్లు ఉంది.

Bengaluru : పనివారి పట్ల వివక్ష చూపుతున్న బెంగళూరు హౌసింగ్ సొసైటీ.. వైరల్ అవుతున్న సొసైటీ మెసేజ్

రానున్న లోక్‭సభ ఎన్నికల దృష్ట్యా విపక్షాల కూటమి ప్రయత్నాలు మంచివే కానీ, కానీ అలాంటి ప్రయత్నాలు చేసే ముందు ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతామని గర్విస్తున్న ఈ పార్టీలు తమ ఉద్దేశాలను కాస్త స్పష్టం చేసి ఉంటే బాగుండేది. నోటిలో రాముడు, పక్కలో కత్తి అన్నట్లు ఎంతకాలం ఉంటుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‭సభ స్తానాలు ఎన్నికల విజయానికి కీలకమనేది అందరికీ స్పష్టం. కానీ ప్రతిపక్ష పార్టీల వైఖరిని బట్టి వారు తమ లక్ష్యం గురించి పెద్దగా ఆందోళన చెందుతున్నట్టు ఏమీ కనిపించడం లేదు. సరైన ప్రాధాన్యాలు నిర్ణయించుకోకుండా, కూటములు కట్టి ఎన్నికలకు వెళ్లినంత మాత్రాన ప్రజలకు అవసరమైన మార్పును తీసుకువస్తాయా అన్న ప్రశ్న వేసుకోవాలి’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

Minister Roja : పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలి.. సినిమాలు చేసుకోవడం మేలు : మంత్రి రోజా

విపక్షాల మీటింగుకు మాయావతి హాజరు కావడం లేదు. వాస్తవానికి ఆమెను విపక్షాల మీటింగుకు పిలవలేదని జనతాదళ్ యూనియన్ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‭లను పిలవలేదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరు అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు