Unstoppable : ఫిలిం నగర్ మహాప్రస్థానం సిబ్బందిని సన్మానించిన బాలయ్య-పవన్..

ఇక ప్రతి ఎపిసోడ్ లోను కష్టపడి బతికేవాళ్ళని, లేదా సమాజానికి ఏదో ఒకరకంగా సేవ చేసేవాళ్ళని ఆహ టీం తీసుకొచ్చి అభినందించి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం కూడా చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఫిలింనగర్ మహాప్రస్థానం సిబ్బందిని తీసుకొచ్చారు. కరోనా సమయంలో కరోనాతో చనిపోతే....................

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ప్రతి ఎపిసోడ్ లోను కష్టపడి బతికేవాళ్ళని, లేదా సమాజానికి ఏదో ఒకరకంగా సేవ చేసేవాళ్ళని ఆహ టీం తీసుకొచ్చి అభినందించి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం కూడా చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఫిలింనగర్ మహాప్రస్థానం సిబ్బందిని తీసుకొచ్చారు. కరోనా సమయంలో కరోనాతో చనిపోతే మనల్ని కనీసం ముట్టుకోనివ్వలేదు, వాళ్ళ శవాలని కూడా అంబులెన్స్ లో పంపించి కాల్చేశారు. చాలా మంది కుటుంబసభ్యులకు చనిపోయిన వారి ఆఖరి చూపు కూడా చూడకుండానే కాల్చేశారు. అంత కరోనాతో చనిపోయినా కూడా కాటికాపరిగా పనిచేసే వాళ్ళు మాత్రం ఎవరు వచ్చినా, రాకపోయినా, కరోనా భయం ఉన్నా చనిపోయిన వాళ్ళని కాల్చారు.

Pawan Kalyan : చిన్నప్పుడు ఆ వ్యాధితో బాధపడ్డా.. అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నా..

దీంతో హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో పనిచేసే సిబ్బందిని పిలిచి వారిని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సన్మానించారు. అందులో ఒకరు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎవరు చనిపోయినా మేమే అంబులెన్స్ లో వెళ్లి మేమే శవాన్ని తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి దహన సంస్కారాలు చేశాం. ఒక దశలో రోజుకి 40 మందికి దహన సంస్కారాలు చేశాం. మేము కూడా భయపడుతూ కూర్చుంటే ఇంక ఎవరు చేస్తారు అని జాగ్రత్తలు తీసుకొని చేశాము అంటూ తెలిపారు. దీంతో పవన్ వారిని, అలాగే ఆ మహాప్రస్థానాన్ని నడిపిస్తున్న ఫీనిక్స్ సంస్థ అధినేతని అభినందిస్తూ, ఆ సిబ్బందికి ఆహా తరపున లక్ష రూపాయల చెక్ అందించారు.

ట్రెండింగ్ వార్తలు