Akhanda: ప్రగ్యతో కలిసి డీప్ ఫారెస్ట్ లో బాలయ్య విన్యాసాలు..

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ శరవేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఇంకో షెడ్యూల్ మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మీద అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది.

Akhanda: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ శరవేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఇంకో షెడ్యూల్ మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మీద అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు యూట్యూబ్లో దుమ్మురేపుతూ రికార్డులను తిరగరాస్తున్నాయి. బోయపాటితో రాబోతున్న మూడవ సినిమా కావడంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇంతటి ఆసక్తిగా మారిన ఈ సినిమా గురించి ఏ మాత్రం చిన్న అప్ డేట్ బయటకి వచ్చినా బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. అభిమానులు అలా ఖుషీ అయ్యే అంశమే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో యాక్షన్ సన్నివేశాలపై అంచనాలు పెంచేసుకుంటారు. ఆ అంచనాలకు తగ్గట్లే రామ్-లక్ష్మణ్ ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలను రూపొందించారట. మరీ ముఖ్యంగా ఇందులో ఫారెస్ట్ యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కానున్నాయట.

క్రిందటి షెడ్యూల్ లో కర్నాటక దండేలి అరణ్యాలకు వెళ్లిన అఖండ టీమ్ అక్కడ ఎన్నో సాహసాలు చేశారట. హీరోయిన్ ప్రగ్యతో కలిసి బాలయ్య డీప్ ఫారెస్ట్ లో బోలెడన్ని విన్యాసాలు చేశారని తెలిసింది. స్టంట్ శివ సారథ్యంలో షూట్ చేసిన రాఫ్టింగ్ అడ్వెంచర్ ఇందులో హైలైట్ కానుందట. రివర్ రాఫ్టింగ్.. ట్రెక్కింగ్ వంటివి జంగిల్ లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను తప్పక థ్రిల్ చేస్తాయని మేకర్స్ నుండి బయటకొచ్చిన ఒక కథనం. ఇంతగా ఊరిస్తున్నారంటే అఖండ విజయం ఖాయమేనేమో!

ట్రెండింగ్ వార్తలు