Cab Stories : వాళ్ల జర్నీలో ఉన్న మలుపులేంటో తెలియాలంటే..?

టీజర్ ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో పాటు మంచి హైప్ తీసుకువ‌చ్చింది. OTT ప్లాట్‌ఫామ్ కోసం ఇదొక ప‌ర్‌ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి అసెట్..

Cab Stories: స్పార్క్ ఓటీటీ చెప్పినట్లుగానే యూనిక్ కంటెంట్‌తో మ‌న ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఇమేజ్‌స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌, ప్రవీణ్, శ్రీహన్ మరియు సిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మే 28న స్పార్క్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది..

‘క్యాబ్ స్టోరీస్’ టీజర్‌ను సునీల్, వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. సునీల్ వాయిస్ ఓవర్‌తో క్యాబ్‌లోకి వచ్చే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో ఈ టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అన్ని పాత్రలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటూ వారి ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అనేక మలుపులు తిరిగిన వారి ప్రయాణం ఎందుకు ఆల‌స్యంగా ప్రారంభమైందో, ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మే 25న ట్రైల‌ర్ రిలీజ‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

టీజర్ ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో పాటు మంచి హైప్ తీసుకువ‌చ్చింది. OTT ప్లాట్‌ఫామ్ కోసం ఇదొక ప‌ర్‌ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి అసెట్. ఇమేజ్‌ స్పార్క్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మించబడిన ఈ ‘క్యాబ్ స్టోరీస్’ కు కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని, సాయి కార్తీక్ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. వ్య‌వ‌హ‌రించారు.

ట్రెండింగ్ వార్తలు