సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు

Ap Elections 2024: హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి..

Apsrtc

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మే 13న ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నడుస్తాయి. 11వ తేదీన 302 సర్వీసులు నడిపారు. 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

ఎక్కడి నుంచి ఎన్ని బస్సులు?

  • ఇవాళ హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 38
  • ఏలూరుకు 20
  • మచిలీపట్నానికి 23
  • విజయవాడకు 45
  • గుంటూరుకు 18
  • నరసరావు పేటకు 26
  • నెల్లూరుకు 17
  • నంద్యాలకు 19
  • విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు

ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేక బస్సులు?

  • హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులు
  • విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు
  • బెంగుళూరు నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 11 వ తేదీన మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు