Cm Chandrababu: ఏపీలో ఎన్నికలు.. రెడీగా ఉండండి.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Representative Image (Image Credit To Original Source)
- 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు
- వైసీపీ చేసిన విధ్వంసాన్ని, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలి
- ఎన్నికలు ఏవైనా గెలుపు మనదే కావాలి
Cm Chandrababu: ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఎన్నికల హడావుడి కనిపించనుంది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల్లో జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని చెబుతూనే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనం గెలిచామన్న చంద్రబాబు, ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని తేల్చి చెప్పారు. పంచాయతీల మాదిరిగానే నీటి సంఘాలు నీటి పన్ను వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడికి చెప్పారు సీఎం చంద్రబాబు. చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఏపీలో గ్యాస్ కొరత అంశంపైనా చంద్రబాబు స్పందించారు. గ్యాస్ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. కొందరు గ్యాస్కి ప్రత్యామ్నాయoగా ఎలక్ట్రిక్ స్టవ్ లు వాడుతున్నారని మంత్రులు చంద్రబాబుతో చెప్పగా.. వాటి వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, విద్యుత్ డిమాండ్ పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
