Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం

బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది....

బలహీనపడిన బిపర్ జోయ్ తుపాన్...ఇక సహాయ పనులు ముమ్మరం

Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది.బిపర్‌జోయ్ తుపాన్ ఆగ్నేయ పాకిస్థాన్‌ను ఆనుకొని నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలవీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ ఒక ట్వీట్ లో తెలిపింది. (Next 12 Hours After Widespread Destruction)ఈ తుపాన్ ప్రభావంతో కచ్‌లోని భుజ్‌లో పలు చెట్లు నేలకూలాయి. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం రంగంలోకి దిగి క్లియరెన్స్ పనులను చేపట్టింది.

Bipar-joy cyclone babies Born: గుజరాత్లో 707 మంది బిపర్ జోయ్ తుపాన్ శిశువులు జన్మించారు

అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్‌జోయ్ తుపాన్ భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని చుట్టుముట్టింది. గురువారం రాత్రి కచ్‌లోని జఖౌ నౌకాశ్రయానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటింది. బిపర్‌జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన తర్వాత రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. దీంతో తుఫాను పీడిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే మరికొన్ని రైళ్లను రద్దు చేసింది.

Furniture Warehouse Fire breaks out : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

శనివారం తెల్లవారుజామున గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌లో తుపాన్ అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. పలు జిల్లాల్లో జరిగిన తుపాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించాలని బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లను గుజరాత్ సీఎం ఆదేశించారు.

Planes secured at Ahmedabad airport: తీరం దాటిన తుపాన్, అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానాలు సురక్షితం

తుపాను కారణంగా బలమైన గాలులతోపాటు భారీ వర్షం కురవడంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాన్ కారణంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలోనూ వర్షం కురిసింది.తుపాన్ అనంతరం రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు