Bipar-joy cyclone babies Born: గుజరాత్లో 707 మంది బిపర్ జోయ్ తుపాన్ శిశువులు జన్మించారు

బిపర్‌జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు....

బిపర్ జోయ్ గాలివానలో 707 మంది శిశువుల జననం

Bipar-joy cyclone 700 babies born in Gujarat : బిపర్‌జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ పీడిత 8 జిల్లాల నుంచి గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 500 కు పైగా వాహనాలను వినియోగించింది. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు. తుపాన్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Assam flood: అసోం వరదల్లో 25 గ్రామాల ముంపు..29 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

బిపర్ జోయ్ తుపాను ప్రభావం ఉన్న 8 జిల్లాల్లోని 1,171 మంది గర్భిణుల్లో 1,152 మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 707 మంది మహిళలు ప్రసవించారని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. బిపర్ జోయ్ తుపాన్ సందర్భంగా పండంటి పిల్లలు జన్మించడంతో వారికి కొందరు బిపర్ జోయ్ అంటూ పేర్లు పెట్టుకొని సంతోషం వ్యక్తం చేశారు. తుపాన్ వల్ల గుజరాత్ రాష్ట్రంలో 5,100 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 3,580 గ్రామాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

గుజరాత్ రాష్ట్రంలో దాదాపు వెయ్యి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. తుపాన్ కారణంగా 600 చెట్లు నేలకొరిగాయి. మూడు రాష్ట్ర రహదారులను మూసివేశారు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.కచ్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు ఖాళీ చేయబడ్డారు మరియు 348 తుఫాను శిశువులు జన్మించారు. రాజ్‌కోట్‌లో వంద మంది, దేవభూమి ద్వారకలో 93 మంది పిల్లలు జన్మించారు. గుజరాత్‌లోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 707 మంది శిశువులు విజయవంతంగా ప్రసవించారని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు