Assam flood: అసోం వరదల్లో 25 గ్రామాల ముంపు..29 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఈ ఏడాది మళ్లీ అసోంలో వరదలు వెల్లువెత్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో అసోం రాష్ట్రంలోని పలు నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. లఖింపూర్, దీమాజీ, దిబ్రూఘడ్, కచార్, నల్బరీ, కామ్ రూప్ జిల్లాల్లోని 10 రెవెన్యూ సర్కిళ్లలోని 25 గ్రామాల్లోకి వరదనీరు చేరింది....

వరదలతో అసోం అతలాకుతలం

Assam flood 25 villages affected: ఈ ఏడాది మళ్లీ అసోంలో వరదలు వెల్లువెత్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో అసోం రాష్ట్రంలోని పలు నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. లఖింపూర్, దీమాజీ, దిబ్రూఘడ్, కచార్, నల్బరీ, కామ్ రూప్ జిల్లాల్లోని 10 రెవెన్యూ సర్కిళ్లలోని 25 గ్రామాల్లోకి వరదనీరు చేరింది.(29,000 people, 25 villages affected)వరదప్రాంతాలకు చెందిన 29వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ శుక్రవారం వెల్లడించింది.

Hunter killed Drones: భారత మిలటరీ అమ్ముల పొదిలోకి హంటర్ కిల్లర్ డ్రోన్లు

అసోంలోని 215 హెక్టార్ల పంటభూములు వరద పాలై దెబ్బతిన్నాయి. లఖింపూర్ ఒక్కజిల్లాలోనే 1215 మంది పిల్లలు, 23,516 మంది ప్రజలు వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. వరద బారిన పడిన లఖింపూర్ జిల్లాలో మూడు సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెస్క్యూ బృందాలను మోహరించామని జిల్లా కలెక్టర్ చెప్పారు.

Union Minister House Set On Fire: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, దహనం

అసోం రాష్ట్రంలో  6,307 జంతువులు, పలు కోళ్లు వరదనీటి పాలయ్యాయి. దీమాయ్, బిశ్వనాథ్, గోల్పర, లఖింపూర్ జిల్లాల్లో నాలుగు రోడ్లు వరదనీటి ప్రవాహంతో దెబ్బతిన్నాయి. కాచర్, కాంరూప్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు