BiggBoss 8 : బాబోయ్.. మళ్ళీ మొదలవుతున్న బిగ్‌బాస్.. సీజన్ 8 లోగో ప్రోమో చూశారా? ఈసారి ఎవరొస్తారో?

తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోగో ప్రోమోని విడుదల చేసారు.

Telugu Bigg Boss Season 8 Logo Promo Released by Nagarjuna

BiggBoss 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తిచేసుకొని ఇప్పుడు 8వ సీజన్ రాబోతుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోగో ప్రోమోని విడుదల చేసారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. నాగార్జున బిగ్ బాస్ 8 ప్రోమో షేర్ చేయడంతో ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యాంకర్ రీతూ చౌదరి, వేణుస్వామి, నయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, ఓ సెలబ్రిటీ కపుల్.. ఇలా మరికొంతమంది పేర్లు కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారని వినిపిస్తున్నాయి.

Also Read : Viraaji Trailer : వరుణ్ సందేశ్ ‘విరాజి’ ట్రైలర్ చూశారా? హారర్ థ్రిల్లర్‌తో కొత్త గెటప్‌లో వరుణ్..

అయితే అధికారికంగా ఇప్పటిదాకా ఎవరి పేర్లు ప్రకటించలేదు. గత సీజన్ వివాదాలమయంగా నిలవడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది. కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు? ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి అని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తుంటే ఇక బిగ్ బాస్ ని విమర్శించే వాళ్ళు మళ్ళీ ఎందుకు తెచ్చార్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు