Viraaji Trailer : వరుణ్ సందేశ్ ‘విరాజి’ ట్రైలర్ చూశారా? హారర్ థ్రిల్లర్‌తో కొత్త గెటప్‌లో వరుణ్..

తాజాగా వరుణ్ సందేశ్ విరాజి సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.

Viraaji Trailer : వరుణ్ సందేశ్ ‘విరాజి’ ట్రైలర్ చూశారా? హారర్ థ్రిల్లర్‌తో కొత్త గెటప్‌లో వరుణ్..

Varun Sandesh Viraji Movie Trailer Released by Director Srikanth Addala

Updated On : July 21, 2024 / 7:22 PM IST

Viraaji Trailer : వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు త్వరలో ‘విరాజి’ సినిమాతో రాబోతున్నాడు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా విరాజి సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Ram Charan : RC16 షూటింగ్ అప్డేట్.. ఆ పనిలో బిజీగా ఉన్న రామ్ చరణ్..

విరాజి సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా విరాజి సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. వరుణ్ సందేశ్ కి కొత్తబంగారులోకం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ఈ ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. మీరు కూడా విరాజి ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ లాంచ్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా హీరో వరుణ్ సందేశ్. విరాజి సినిమా ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి. సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెటప్ కూడా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ కూడా కొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో వరుణ్ మరో హిట్ కొడతాడు అని అన్నారు.

Varun Sandesh Viraaji Movie Trailer Released by Director Srikanth Addala