Verri Pest in Brinjal Crop : వంగతోటలను నష్టపరుస్తున్న వెర్రితెగులు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు 

Verri Pest in Brinjal Crop : వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.

Verri Pest Control in Brinjal Crop

Verri Pest in Brinjal Crop : తెలుగు రాష్ట్రాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ వుంది. 6 నెలలు కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా వుంది. వీటి తాకిడితో 30 నుండి 50 శాతం వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా వంగను ఆశించే వెర్రితెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది. పచ్చదోమ, ఆకుమచ్చ, వేరుకుళ్లు, మొవ్వు కాయతొలుచు పురుగుల నష్టం అధికంగా కనిపిస్తోంది. ప్రధానంగా పచ్చదోమ ద్వారా వెర్రితెగులు ఆశించి తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఖమ్మం జిల్లా ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య రైతాంగానికి తెలియజేస్తున్నారు.

తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వంగకు  మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే మంచి  దిగుబడిని సాధించవచ్చు.

Read Also : Turmeric Crop Cultivation : వాతావరణ మార్పులతో పసుపుకు తెగుళ్ల బెడద – నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు 

ట్రెండింగ్ వార్తలు