×
Ad

Niharika – Pawan Kalyan : నిహారిక ఫోన్‌లో పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?

నిహారిక ఓ ఇంటర్వ్యూలో తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

  • Published On : July 22, 2024 / 07:53 AM IST

Niharika Konidela says Interesting Things about Pawan Kalyan

Niharika – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి, మెగా కజిన్స్ కి ఎంత క్లోజ్ అనుబంధం ఉందో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా ఎన్నికల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడింది. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కిస్తోంది.

కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిహారిక ఓ ఇంటర్వ్యూలో తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. నిహారిక మాట్లాడుతూ.. ఆయన మాకు ఇప్పటికి పవర్ స్టారే. ఎన్నికల ఫలితాల ముందు రోజు అందరం ఇంట్లో టీవీ ముందే ఉన్నాం. మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది. బాబాయ్ స్పీచ్ లు చాలా బాగుంటాయి, అవి నన్ను ఎంతో మోటివేట్ చేశాయి. ఆయన రాజకీయాల్లో ఉన్నా స్టారే. బాబాయ్ ని ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతాను అని తెలిపింది.

Also Read : Yadamma Raju : తండ్రి కాబోతున్న పటాస్ యాదమ్మ రాజు..

అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నంబర్ తన ఫోన్ లో ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలిపింది నిహారిక. నిహారిక ఫోన్ లో పవన్ కళ్యాణ్ పేరు KKK అని సేవ్ చేసి ఉంటుందట. KKK అంటే కొణిదల కళ్యాణ్ కుమార్ అని కళ్యాణ్ బాబ్బాయి అసలు పేరు అని తెలిపింది నిహారిక.