Yadamma Raju : తండ్రి కాబోతున్న పటాస్ యాదమ్మ రాజు..

తాజాగా యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ తాము పేరెంట్స్ కాబోతున్నామని ప్రకటించారు.

Yadamma Raju : తండ్రి కాబోతున్న పటాస్ యాదమ్మ రాజు..

Yadamma Raju wife Stella Raj Announced her Pregnancy

Updated On : July 22, 2024 / 7:12 AM IST

Yadamma Raju : పటాస్ షోలో ఒక స్టూడెంట్ గా వచ్చిన తన మాటలతో, కామెడీతో ఆకట్టుకొని అదే షోలో కమెడియన్ గా మారాడు యాదమ్మ రాజు. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం యాదమ్మ రాజు జబర్దస్త్ చేస్తూ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. యాదమ్మ రాజు తను ప్రేమించిన అమ్మాయి స్టెల్లా రాజ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : BiggBoss 8 : బాబోయ్.. మళ్ళీ మొదలవుతున్న బిగ్‌బాస్.. సీజన్ 8 లోగో ప్రోమో చూశారా? ఈసారి ఎవరొస్తారో?

తాజాగా యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ తాము పేరెంట్స్ కాబోతున్నామని ప్రకటించారు. పేరెంట్స్ కాబోతున్నట్టు స్పెషల్ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఎనిమిదేళ్ల ప్రేమ, సంవత్సరంన్నర పెళ్లి.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసాము. ఊహించనివి ఎన్నో మా జీవితంలో జరిగాయి. ఎన్ని జరిగినా మా బంధం మరింత గట్టిపడుతూనే వస్తుంది. మా ఫ్యామిలీ ఇప్పుడు మరింత పెద్దది అవుతుంది. ఈ ప్రగ్నెన్సీ మా జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపింది. ఈ జర్నీ చేయడానికి ఎంతో ఆసక్తిగా అంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కు ధన్యవాదాలు అని తెలిపారు యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్. దీంతో పలువురు టీవీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.