Union Minister House Set On Fire: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, దహనం

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేసి, దహనం చేశారు.....

మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు

Union Minister House Set On Fire: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేసి, దహనం చేశారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు.ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు.

Jammu and Kashmir Encounter:జమ్మూ కాశ్మీర్‌ కుప్వారా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్

మంత్రి ఇంటి వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది ఆందోళనకారుల కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు.దాడి సమయంలో ఆందోళనకారులు నలువైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరినట్లు మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తెలిపారు.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

మంత్రి ఇంటిపై మూకుమ్మడి దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో జరిగిన దాడిలో ఆందోళనకారుల గుంపును చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో తాను అధికారిక పనిపై కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని మంత్రి చెప్పారు. మణిపూర్ లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి సింగ్ కోరారు.

ట్రెండింగ్ వార్తలు