Jammu and Kashmir Encounter:జమ్మూ కాశ్మీర్‌ కుప్వారా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్..ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ జరిగింది...

జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్

Jammu and Kashmir Encounter:జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ జరిగింది.(terrorists, security forces in J&Ks Kupwara)జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి చేపట్టిన గాలింపు సందర్భంగా ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు జరిగాయని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.

Cyclone Biparjoy To Reach Rajasthan: రాజస్థాన్‌కు మళ్లిన బిపర్‌జోయ్ తుపాన్..నేడు భారీ వర్షాలు

జూన్ 13వతేదీన కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు. దోబనార్ మచల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.కుప్వారా జిల్లాలోని దోబనార్ మచల్ ప్రాంతంలో (ఎల్‌ఓసి) ఆర్మీ,కుప్వారా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇంకా ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది’’ అని జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.

Road Accident In Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..15మంది మృతి

ఈ నెల ప్రారంభం జూన్ 2 వతేదీన జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రాజౌరి సమీపంలోని దస్సల్ గుజ్రాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలను గమనించిన తర్వాత సైన్యం, పోలీసులు సంయుక్త కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రక్షణ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు