తెలంగాణ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS Complaints: కరీంనగర్ అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు.

ప్రొటోకాల్ సమస్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‍‌కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అపాయింట్‌మెంట్ కోరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తమ హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని చెప్పారు.

తమకు ఇవాళ సమయం ఇచ్చినప్పటికీ స్పీకర్ అసెంబ్లీకి రాలేదని అన్నారు. నియోజక వర్గాల్లో ఎవరూ ప్రొటోకాల్ పాటించడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలుగా తమ హక్కులు కాపాడుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని తెలిపారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు. తాను విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తే జిల్లా విద్యాశాఖాధికారి ఎంఈవోలపై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై జడ్పీ సమావేశంలో నిరసన తెలిపామని అన్నారు. దీంతో తమపై కేసు నమోదు చేశారని చెప్పారు.

తాను కేసులకు భయపడనని అన్నారు. కాగా, స్పీకర్ ప్రసాద్ కుమార్ కోసం రెండు గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారు. ఉదయం 11 గంటలకు రావాలని అపాయింట్‌మెంట్ ఇచ్చినా మధ్యాహ్నం వరకు స్పీకర్ అక్కడికి రాలేదని అంటున్నారు.

Also Read: సీఎం అయ్యాక తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు.. టీటీడీపీ నేతలకు కీలక సూచన.. అదేమిటంటే?

ట్రెండింగ్ వార్తలు