Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సమయంలో బ్రేకప్ చెప్పేదాన్ని.. మళ్లీ వెళ్లి..
పుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శనివారం డిశ్చార్చి అయింది.
- Thota Vamshi Kumar
- Published On : July 22, 2024 / 12:56 PM IST
Janhvi Kapoor reveals why she broke up with Shikhar Pahariya
పుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శనివారం డిశ్చార్చి అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తండ్రి బోనీకపూర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల జాన్వీ కపూర్ హాట్టర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను చెప్పేసింది. ఇందులో తన బాయ్ ప్రెండ్, బ్రేక్ అప్ వంటి విషయాలను వెల్లడించింది. అయితే.. ఆమె తన బాయ్ ఫ్రెండ్ పేరును మాత్రం చెప్పలేదు.
‘పిరియడ్స్ టైమ్‌లో చికాకుగా ఉండేది. ఆ సమయంలో బాయ్‌ప్రెండ్‌కు బ్రేకప్ చెప్పేదాన్ని. మొదటి రెండేళ్ల సమయంలో ఇలా చాలా సార్లు చేశాను. అయితే.. అతడు మొదటి మూడు నెలలు షాక్‌లో ఉండేవాడు. ఆ తరువాత నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి నేను ఏమన్నా గానీ పట్టించుకోవడం మానేశాడని.’ జాన్వీ చెప్పింది. రెండు రోజుల తరువాత తానే వెళ్లి అతడికి క్షమాపణ చెప్పేదాన్ని. అప్పట్లో తన మెదడు ఎందుకిలా పని చేస్తుందో తనకు అర్థం కాలేదంది.
Rupali Singh – Vicky Kaushal : పల్లెటూరి మహిళ డ్యాన్స్ వైరల్.. బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్..
ఇక తనకు ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందో మళ్లీ అతడే దాన్ని సరిచేశాడని జన్వీ అంది. ఇప్పటి వరకు తన జీవితంలో ఒకేఒక సారి నిజంగా హార్ట్ బ్రేక్ అయిందని తెలిపింది. కానీ అతడే మళ్లీ వచ్చి నా హృదయాన్ని సరిచేశాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది అని జాన్వీ కపూర్ తెలిపింది.
మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో జాన్వీకపూర్ ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, మీడియా కంట పడడం జరుగుతూనే ఉంటుంది. అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు కలిసే కనిపించారు.
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరేంటో తెలుసా? అప్పుడు పుట్టాడని..
ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘ఉలఝ్’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
