Do You Know Animal Movie Director Sandeep Reddy Vanga Son Name
Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. సరికొత్త కథ, కథనంతో కొత్త ఆలోచనలతో వచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి ఈ జనరేషన్ కి బాగా దగ్గరయ్యాడు. అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి పాన్ ఇండియా భారీ హిట్ కొట్టాడు సందీప్.
తనకంటూ ఫిలిం మేకింగ్ సపరేట్ స్టైల్ సృష్టించుకొని చేసిన మూడు సినిమాలతోనే అభిమానులని సంపాదించుకొని తన తర్వాత సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు సందీప్. సందీప్ వంగ త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సందీప్ వంగకు పెళ్లి అయి ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ బాబు పేరేంటో తెలుసా?
Also Read : Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఏం మారలేదు.. అదే స్టైల్.. అదే పవర్ ఫుల్ వాక్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అందుకే వాడి పేరు అర్జున్ రెడ్డి అని పెట్టాను. అర్జున్ అనే పేరు నాకు ఇష్టం. ఆ పేరులో ఏదో షార్ప్ నెస్ ఉంటుంది. అందుకే సినిమాకు, నా కొడుక్కి కూడా అదే పేరు పెట్టుకున్నాను అని తెలిపారు. కొంతమంది సినిమా వాళ్ళు తమకు కలిసొచ్చిన సినిమాలని సెంటిమెంట్ గా మార్చుకొని ఇలా పేర్లు పెట్టుకుంటారని తెలిసిందే. అలాగే అర్జున్ రెడ్డి షూటింగ్ చేసేటప్పుడు పుట్టాడని తన కొడుక్కి అర్జున్ రెడ్డి పేరు పెట్టడం గమనార్హం.