Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఏం మారలేదు.. అదే స్టైల్.. అదే పవర్ ఫుల్ వాక్..

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటారని తెలిసిందే.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఏం మారలేదు.. అదే స్టైల్.. అదే పవర్ ఫుల్ వాక్..

Deputy CM Pawan Kalyan Power Full Stylish Walk Video goes Viral

Updated On : July 22, 2024 / 10:31 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఊహించనంత అభిమానులు, వాళ్ళ అభిమానం పవన్ సొంతం. సినిమాల్లో ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా, రాజకీయాల్లో ఓడిపోయినా వెనక్కి తగ్గకుండా పవన్ వెంటే ఉండి ఇటీవల జరిగిన ఎన్నికలో భారీగా గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు.

ఎంత రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాల నుంచి వచ్చిన స్టైల్ ఈజీగా పోదుగా. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటారని తెలిసిందే. ఆయన డ్రెస్సింగ్, కళ్ళజోడు,వాకింగ్ స్టైల్ ఇవన్నీ అదిరిపోతాయి. రాజకీయాల్లో వైట్ అండ్ వైట్ డ్రెస్సుతో సింపుల్ గా కనిపించినా ఒక్కసారి బయటకి వచ్చి నార్మల్ డ్రెస్ వేస్తే పవన్ కళ్యాణ్ అంత స్టైల్ గా ఎవరూ ఉండలేరు.

Also Read : Tollywood Actor : స్టార్ నటుడి భార్య పిల్లలు.. ఈ ఫొటోలో ఉన్నవాళ్లను గుర్తు పట్టారా?

తాజాగా పవన్ కళ్యాణ్ నార్మల్ డ్రెస్ లో నడిచి వస్తున్న వీడియో వైరల్ అయింది. ఇటీవల తన భార్య మాస్టర్స్ డిగ్రీ ఈవెంట్ కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నిన్న తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ బయటకు నడిచి వస్తున్న వీడియోలు కొన్ని వైరల్ గా మారాయి. పవన్ ఒక గ్రేస్ తో స్టైలిష్ గా నడుస్తారు. నిన్న కూడా పవన్ అంతే స్టైల్ తో, అదిరిపోయే పవర్ ఫుల్ వాక్ తో నడిచి వస్తుంటే అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో పవన్ వాకింగ్ వీడియోలు వైరల్ గా మారాయి. గతంలో కూడా పవన్ పవర్ ఫుల్ వాకింగ్ వీడియోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు కూడా అంతే గ్రేస్ తో పవన్ నడుస్తుండటంతో రాజకీయాల్లోకి వెళ్లినా, డిప్యూటీ సీఎం అయినా పవన్ ఏం మారలేదు.. అదే గ్రేస్, అదే పవర్ ఫుల్ వాకింగ్ స్టైల్ అని ఇంద్ర సినిమా డైలాగ్ స్టైల్లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిన్న తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ నేడు ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.