Senior Citizens FD Rates : ఈ బ్యాంకు FDలపై 8.10శాతం వరకు భారీ వడ్డీ ఇస్తోంది.. సీనియర్ సిటిజన్లకు గోల్డెన్ ఛాన్స్..!
Senior Citizens FD Rates: సినీయర్ సిటిజన్ల కోసం ఈ బ్యాంకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇటీవలే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేట్లను సవరించి కొత్త రేట్లను వెల్లడించింది. మార్చి 6 నుంచి అమలులోకి వచ్చాయి.
Senior Citizens FD Rates ( Image Credit : Gemini AI )
- సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు
- ఈ బ్యాంకు FDలపై ఏకంగా 8.10 శాతం వడ్డీ రేట్లు
- మార్చి 6 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి
Senior Citizens FD Rates : సినీయర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. చాలా మంది పెట్టుబడుల కోసం ఎక్కువగా బ్యాంక్ FDలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా బ్యాంక్ ఎఫ్డీలు సీనియర్ సిటిజన్లలో బాగా పాపులర్ అయ్యాయి. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కన్నా FDలపై అధిక వడ్డీ రేట్లను పొందవచ్చు.
మీరు సీనియర్ సిటిజన్ అయితే మీ డబ్బును పెట్టుబడి పెట్టేందుకు బ్యాంక్ ఎఫ్డీలు చాలా బెస్ట్. మీరు ఏకంగా 8శాతం వరకు రాబడిని సంపాదించుకోవచ్చు. బ్యాంకు ఎఫ్డీల విషయానికి వస్తే.. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇటీవలే బ్యాంక్ FD వడ్డీ రేట్లను సవరించింది. ఆపై కొత్త రేట్లను కూడా ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మార్చి 6 నుంచి అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5ఏళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు :
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 ఏళ్ల ఎఫ్డీపై 7.90శాతం రాబడిని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 8.10 శాతంగా ఉంటాయి. మీరు మీ డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర టెన్యూర్ సీనియర్ సిటిజన్లకు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
- 1 సంవత్సరం : 7.45 శాతం
- 2 సంవత్సరాలు : 7.45 శాతం
- 3 సంవత్సరాలు : 7.45 శాతం
- 4 సంవత్సరాలు : 6.95 శాతం
- 5 సంవత్సరాలు : 8.10 శాతం
- 10 సంవత్సరాలు : 7.45 శాతం
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై రాబడి :
మీరు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 5 ఏళ్ల FDలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తం రూ. 7.46 లక్షలు అందుతాయి. అంటే.. మీరు మొత్తం రూ. 2.46 లక్షల రాబడి పొందుతారు. సాధారణ పౌరులకు ఈ రాబడి రూ. 2.39 లక్షలుగా ఉంటుంది.
