Tollywood Actor : స్టార్ నటుడి భార్య పిల్లలు.. ఈ ఫొటోలో ఉన్నవాళ్లను గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో ఉన్నవాళ్లు ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు హీరోగా, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు వాళ్ళ అభిమానం పొందిన దివంగత నటుడి భార్య పిల్లలు.

Tollywood Actor : స్టార్ నటుడి భార్య పిల్లలు.. ఈ ఫొటోలో ఉన్నవాళ్లను గుర్తు పట్టారా?

Tollywood Actor Shares old photo of his Parents Photo goes Viral

Updated On : July 22, 2024 / 9:58 AM IST

Tollywood Actor : ఈ ఫొటోలో ఉన్నవాళ్లు ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు హీరోగా, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు వాళ్ళ అభిమానం పొందిన దివంగత నటుడి భార్య పిల్లలు. ఆ నటుడు ఎవరో కాదు శ్రీహరి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో శ్రీహరి మనల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. శ్రీహరి 2013లో ఆరోగ్య సమస్యలతో మరణించారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా నటి, డ్యాన్సర్ అని మనకు తెలుసు.

శ్రీహరి – డిస్కోశాంతికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే పిల్లలు కూడా ఇప్పుడు సినిమా రంగంలోనే ఉన్నారు. పెద్ద కొడుకు శశాంక్ శ్రీహరి డైరెక్టర్ గా ఒక సినిమా చేసాడు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు ప్రయత్నిస్తున్నాడు. ఇక రెండో కొడుకు మేఘామ్ష్ శ్రీహరి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రాజ్ దూత్ సినిమాతో హీరోగా మెప్పించగా మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Also Read : Prabhas – Sjala Ali : ప్రభాస్ కోసం పాకిస్థాన్ నుంచి ఆ నటి..?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేఘామ్ష్ శ్రీహరి తాజాగా చిన్నప్పుడు పేరెంట్స్ తో కలిసి దిగిన ఈ పాత ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫొటోలో శ్రీహరి, డిస్కో శాంతి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.