Shani Asta : 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆ రాశిలో శని అస్తమయం.. ఈ రాశుల వారికి ఇక తిరుగు లేదు
Shani Asta : శని గ్రహానికి సంబంధించి సుమారు 30 సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం జరగబోతుంది. దాని వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుంది అంటే..
shani asta 2026 how saturn combust in pisces will give good results for few zodiacs
Shani Asta : నవగ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. శని గ్రహం పేరు చెబితే జనాలు భయపడిపోతారు. కానీ మనం చేసే కర్మలను బట్టే శని దేవుడు ఫలితాలను ఇస్తాడు. క్రమశిక్షణ, బాధ్యత, న్యాయం వంటి వాటికి శని ప్రతీక. శని ప్రభావం మనుషుల జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. శని గ్రహం.. అనారోగ్యం, ఆయుష్షు, జీవితంలో పోరాడే దశ, ఉద్యోగం, సాంకేతిక రంగాలతో పాటు సేవా మార్గం, నూనె, ఇనుము వంటి అంశాలకు కారకత్వం వహిస్తుంది. అందుకే శని గ్రహ చలనంలో ఏ చిన్న మార్పు వచ్చినా.. పైన చెప్పిన రంగాలన్నింటిపైన ఆ ప్రభావం పడుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శని గ్రహ కదలికలకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. దృక్ పంచాంగం ప్రకారం, హోలీ పండగ అయిపోయిన పది రోజుల తర్వాత అంటే మార్చి 13, 2026 శుక్రవారం సాయంత్రం 7:13 గంటలకు.. మీన రాశిలో శని గ్రహం అస్తమించబోతోంది. దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత.. శని గ్రహం ఇంత పెద్ద మార్పుకు లోనుకాబోతోంది అంటున్నారు. మీన రాశిలో శని అస్తమయం జరగడం చాలా కీలకమైన పరిణామం అంటున్నారు జ్యోతిష్యులు.
శని అస్తమయ ప్రభావం 12 రాశులపైన ఉంటుందని.. అయితే ఈ సారి జరగబోయే ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది అంటున్నారు. మార్చి 13న శని అస్తమయం చోటు చేసుకుంటుంది. ఇది 40 రోజుల పాటు కొనసాగనుంది. అంటే మళ్లీ ఏప్రిల్ 22న శని ఉదయించనుంది. అప్పటి వరకు కొన్ని రాశుల వారికి జాబ్, సంపద, వ్యక్తిగత జీవితంలో సానుకూలత వంటి అంశాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయని.. శని అస్తమించే ఈ 40 రోజులు వారికి అదృష్టం పట్టబోతోంది అంటున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవంటే..
ధనుస్సు రాశి
శని అస్తమయం మీన రాశిలో సంభవిస్తున్నందున.. ధనుస్సు రాశి వారికి అత్యంత శుభప్రదం కానుంది. ఈ శని అస్తమయ సమయంలో ఈ రాశి వారి జీవితాల్లో భౌతిక సుఖాలు, సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఈ రాశి వారు సొంత ఇల్లు, వాహనం, ఇతర ఆస్తులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయని.. ఆర్థికంగా కొత్త అవకాశాలు వీరి తలుపు తడతాయని అంటున్నారు. వేరే ఉద్యోగంలోకి మారాలని భావించే వారికి ఇది మంచి సమయం అని.. వారు కోరుకున్నట్లే మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అలానే ఈ శని అస్తమయం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉందంటున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి జరుగుతుంది అంటున్నారు.
కుంభ రాశి
శని అస్తమయం వల్ల అదృష్టం వరించే మరో రాశి కుంభం. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుంభ రాశి వారికి.. శని అస్తమయ సమయంలో భారీ ఊరట లభిస్తుందని.. ఆర్థిక విషయాల్లో సమస్యలు తగ్గి.. ఆకస్మిక ధన యోగం ఉందంటున్నారు. అలానే వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో మిగిలిపోయిన మొండి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మీడియా, సేల్స్, మార్కెటింగ్, విద్యా రంగాల్లో పని చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.
మీన రాశి
శని అస్తమయం వల్ల అదృష్టం వరించే వారిలో మీన రాశి వారు ఉన్నారు. శని అస్తమయం జరుగుతుంది ఈ రాశిలోనే కావడంతో వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. శని అస్తమయ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామి వృత్తి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశి వారు ఎంతో కాలంగా కష్టపడుతున్న పనుల్లో ఇప్పుడు విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది.
