Cyclone Biparjoy To Reach Rajasthan: రాజస్థాన్‌కు మళ్లిన బిపర్‌జోయ్ తుపాన్..నేడు భారీ వర్షాలు

బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్‌రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు....

Cyclone Biparjoy To Reach Rajasthan

Cyclone Biparjoy To Reach Rajasthan: బిపర్‌జోయ్ తుపాన్ శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం తెలిపింది.ఈ తీవ్ర తుపాన్ సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది ఈశాన్య దిశగా కదులుతుందని భావిస్తున్నామని ఐఎండీ అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rain Likely)కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

‘‘తీవ్ర తుఫాను బిపర్‌జోయ్ శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు నాలియాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది’’ అని ఐఎండీ ఒక ట్వీట్‌లో పేర్కొంది. తుపాన్ సముద్రం నుంచి భూమికి వచ్చి సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. గుజరాత్‌లో విధ్వంసం తర్వాత,బిపర్ జోయ్ తుఫాను రాజస్థాన్‌కు మళ్లింది.

ట్రెండింగ్ వార్తలు