Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని దాటడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. గుజరాత్ సముద్ర తీరప్రాంతాల్లో తుపాన్ వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తుపాన్ విపత్తు వల్ల 22 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు...

Cyclone Biparjoy Efect

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని దాటడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. గుజరాత్ సముద్ర తీరప్రాంతాల్లో తుపాన్ వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తుపాన్ విపత్తు వల్ల ఇద్దరు మరణించగా, మరో  22 మంది(22 Injured) తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. తీవ్ర గాలుల వల్ల గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 524 చెట్లు నేలకొరిగాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అంధకారం అలముకుంది.(940 Villages Plunge Into Darkness)

Cyclone Biparjoy: తీరాన్ని తాకిన అత్యంత తీవ్ర బిపోర్ జాయ్ తుపాను.. భారీ వర్షాల బీభత్సం.. లక్షమంది తరలింపు

తుపాన్  వలకల సౌరాష్ట్ర, కచ్ తీరాలను తాకడంతో భారీవర్షాలు కురిశాయి. ముందు జాగ్రత్త చర్యగా సముద్ర తీర ప్రాంత గ్రామాల నుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. తుపాన్ వల్ల 23 జంతువులు మరణించాయని గుజరాత్ సహాయ పునరావాస కమిషనర్ అలోక్ సింగ్ చెప్పారు. ఈ తుపాన్ సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు తాకడంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

తుపాను ఎఫెక్ట్‌తో గుజరాత్‌ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం

తుపాన్ వల్ల 99 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ద్వారక పట్టణంలో హోర్డింగులు పడిపోయాయి. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో సమీక్షా సమావేశం జరిగింది.అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది.

ట్రెండింగ్ వార్తలు