Rupali Singh – Vicky Kaushal : పల్లెటూరి మహిళ డ్యాన్స్ వైరల్.. బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్..
పశ్చిమ బెంగాల్ లో ఓ గ్రామంలో రూపాలి సింగ్ అనే మహిళ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది.
- Saketh U
- Published On : July 22, 2024 / 11:58 AM IST
Bollywood Hero Vicky Kaushal Comments on Bengal Women Rupali Singh Dance Reel in Instagram
Rupali Singh – Vicky Kaushal : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ట్యాలెంట్ ఉన్న వాళ్ళు బయటకి వస్తున్నారు. తమ ట్యాలెంట్ ని సోషల్ మీడియాలో ప్రదర్శించి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఓ గ్రామంలో రూపాలి సింగ్ అనే మహిళ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది. ముఖ్యంగా అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ పలు వీడియోలు షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
డ్యాన్స్ రీల్స్ తో రూపాలి సింగ్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. చీరకట్టులో పల్లెటూళ్ళో తమ ఇంటి ముందే, తన ఊళ్ళోనే డ్యాన్స్ చేస్తూ రీల్స్ పోస్ట్ చేస్తుండటంతో చాలా న్యాచురల్ గా ఉంటాయి. దీంతో ఆమె వీడియోలు వైరల్ అయి పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా విక్కీ కౌశల్, త్రిప్తి జంటగా నటించిన బ్యాడ్ న్యూస్ సినిమా ప్రమోషన్స్ కోసం ‘తౌబా తౌబా..’ అనే ఓ పాటని పంజాబీ సింగర్ కరణ్ తో కలిసి చేసాడు విక్కీ కౌశల్. ఈ పాట, ఈ పాటలో స్టెప్స్ బాగా వైరల్ అయ్యాయి. రీల్స్ రూపంలో ఈ పాట బాగా వైరల్ అయింది.
Also Read : Allu Arjun : భార్య పిల్లలతో కలిసి బన్నీ ఏ దేశానికి వెకేషన్‌కి వెళ్ళాడో తెలుసా? కొండ అంచున నిలబడి ఫోటో..
చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో ఈ పాటకు రీల్స్ చేశారు. ఇదే క్రమంలో రూపాలి సింగ్ కూడా ఈ తౌబా తౌబా సాంగ్ కి చీరలో తన ఇంటి ముందే డ్యాన్స్ చేసి రీల్ చేసింది. ఇంకేముంది ఈ వీడియో బాగా వైరల్ అయింది. రూపాలి సింగ్ డ్యాన్స్ విక్కీ కౌశల్ దాకా వెళ్లడంతో ఇది చూసి ఆశ్చర్యపోయిన విక్కీ కౌశల్ వావ్ అని కామెంట్ చేసాడు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ రీల్ కింద ఆమెని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలువురు నెటిజన్లు ఆమె డ్యాన్స్ వీడియోలు చూసి ఇలాంటి వాళ్ళు డ్యాన్స్ షోలకు రావాలి, ఇలాంటి వాళ్లకి ఫేమ్ రావాలి అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా రూపాలి సింగ్ వైరల్ డ్యాన్స్ వీడియో చూసేయండి..
