Allu Arjun : భార్య పిల్లలతో కలిసి బన్నీ ఏ దేశానికి వెకేషన్‌కి వెళ్ళాడో తెలుసా? కొండ అంచున నిలబడి ఫోటో..

ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు.

Allu Arjun : భార్య పిల్లలతో కలిసి బన్నీ ఏ దేశానికి వెకేషన్‌కి వెళ్ళాడో తెలుసా? కొండ అంచున నిలబడి ఫోటో..

Allu Arjun Went to Vacation With Family for an Europe Country Details Here

Updated On : July 22, 2024 / 11:50 AM IST

Allu Arjun Family : మన సెలబ్రిటీలు సినిమా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి విదేశాలకు చెక్కేస్తారని తెలిసిందే. మహేష్ బాబు, రామ్ చరణ్ రెగ్యులర్ గా విదేశాలకు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఎన్టీఆర్, బన్నీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు.

Also Read :Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరేంటో తెలుసా? అప్పుడు పుట్టాడని..

అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి యూరప్ లోని నార్వే దేశానికి వెకేషన్ కి వెళ్ళాడు. తాజాగా బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో నార్వే వెకేషన్ నుంచి అక్కడి అందాలను ఫోటోల రూపంలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేసింది. నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్ రాక్ అనే పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భారీ కొండ పైకి ఎక్కి కొండ అంచున ఫ్యామిలీ నలుగురు కలిసి దిగిన ఫోటో కూడా స్టోరీలో షేర్ చేసింది స్నేహ రెడ్డి. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Allu Arjun Went to Vacation With Family for an Europe Country Details Here

రెగ్యులర్ గా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసే స్నేహ ఈ నార్వే వెకేషన్ నుంచి ఇంకెన్ని ఫోటోలు షేర్ చేస్తుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ ఈ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక ఆగస్టులో మళ్ళీ పుష్ప 2 షూటింగ్ మొదలవుతుందని సమాచారం.