Tharun Bhascker : పెళ్లి చూపులు ఎలా హిట్ అయిందో నాకు తెలీదు.. అంత కాన్ఫిడెన్స్ లేదు.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్..
తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. (Tharun Bhascker)
Tharun Bhascker
Tharun Bhascker : దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటి సినిమా విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు సినిమా తీసి మంచి విజయం సాధించారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది ఆ సినిమా. తరుణ్ భాస్కర్, విజయ్ ఇద్దరి కెరీర్స్ ని ఈ సినిమా నిలబెట్టింది. తాజాగా ఈ సినిమా గురించి తరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు సినిమా హిట్ అయింది. దాంతో నా మీద ప్రెజర్ పడింది నెక్స్ట్ ఏంటి అని. అసలు పెళ్లి చూపులు ఎలా హిట్ అయిందో నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. ఏదో అది అయింది. నేను అనుకోలేదు మన సినిమాకు వైజాగ్ లో విజిల్స్ పడతాయి, సీడెడ్ లో టికెట్స్ తెగుతాయి అని. అంత కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. సినిమా చేసాము. ఏదో అయింది అంతే.
అది హిట్ అయ్యాక వచ్చిన ప్రెజర్ ని ఎస్కెప్ అవ్వడానికి ఈ నగరానికి ఏమైంది తీసాను. మా రిలేటివ్స్ మేము బాధల్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్నారు. మమ్మల్ని వదిలేసారు. పెళ్లి చూపులు హిట్ అయ్యాక మళ్ళీ దగ్గరకు వచ్చారు. ఇలా ఉన్నారేంటి మనుషులు అనుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ ఒక నలుగురు మాత్రమే నాతోనే ఏం జరిగినా ఉన్నారు. వాళ్ళ గురించే చెప్దామని ఈ నగరానికి ఏమైంది తీసాను అని తెలిపారు. దీంతో పెళ్లి చూపులు సినిమా గురించి తరుణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
View this post on Instagram
