Tharun Bhascker : పాపం యాంకర్.. తరుణ్ ని త్రిగున్ అనడంతో.. ఫైర్ అయిన కమెడియన్.. దండం పెట్టిన డైరెక్టర్.. బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంట..
ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సీక్వెల్ ట్రైలర్ నేడు రిలీజ్ చేసారు. (Tharun Bhascker)
Tharun Bhascker
Tharun Bhascker : దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సీక్వెల్ ట్రైలర్ నేడు రిలీజ్ చేసారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో యాంకర్ అనూష డైరెక్టర్ ని స్టేజి మీదకు పిలుస్తూ త్రిగున్ అని పిలిచింది. దీంతో అంతా షాక్ అయ్యారు. ఫేమస్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేరు మర్చిపోయి ఇలా త్రిగున్ అని పిలవడంతో పాపం యాంకర్ మర్చిపోయింది అని అనుకున్నారు.
రెండు సార్లు త్రిగున్ పేరు చెప్పి తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకొని వెంటనే తరుణ్ భాస్కర్ అని పిలిచింది. అయితే ఇదే ఈవెంట్లో తర్వాత కమెడియన్ జీవన్ కుమార్ దీని గురించి మాట్లాడుతుండగా మధ్యలో యాంకర్ ఏదో మాట్లాడబోయింది.
Also Read : ENE Repeat Trailer : ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ వాయిస్ తో..
జీవన్ కుమార్ మాట్లాడుతూ.. నమస్తే యాంకర్. మీరు ఏం మాట్లాడక్కర్లేదు. నన్ను మాట్లాడనివ్వండి. ఈయన ఫేమస్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీరు త్రిగున్ అని పిలుస్తున్నారు అని సరదాగానే సీరియస్ అయ్యారు. యాంకర్ అనూష కూడా ఎగ్జైట్మెంట్ లో అలా అన్నాను అని సారీ చెప్పింది. దీంతో తరుణ్ భాస్కర్ ఆమె కాళ్ళ మీద పడినట్టు చేసి ఆమెకు దండం పెట్టాడు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో హీరో త్రిగున్ తన హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో యాంకర్ కి బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంట అందుకే త్రిగున్ అని అంటుంది అని ట్రోల్ చేస్తున్నారు. ఈ యాంకర్ కి సినీ పరిశ్రమలో ఇదే మొదటి అధికారిక ఈవెంట్. మొదటి ఈవెంట్లోనే వైరల్ అవ్వడంతో ఈమెకు బాగానే పబ్లిసిటీ వస్తుంది. మరి మున్ముందు సినిమా ఈవెంట్స్ లో ఎలా యాంకరింగ్ చేస్తుందో చూడాలి.
Side Effects Of Watching BIGG BOSS!
A New Anchor mistakenly referred to Director #TharunBhascker as ‘THRIGUN’ https://t.co/QuTX1xruFw
— Rangasthalam (@RangasthalamIN) November 3, 2026
