Pocket Rockkets : ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ రిలీజ్.. శ్రీలంకకు వెళ్లి మరీ గ్యాంబ్లింగ్.. భలే ఉందే..
మీరు కూడా పాకెట్ రాకెట్స్ టీజర్ చూసేయండి.. (Pocket Rockkets)
Pocket Rockkets
Pocket Rockkets : త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా, శ్రియ కొంతం హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా పాకెట్ రాకెట్స్. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్ పై పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాణంలో రుద్ర అత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు ది ఫస్ట్ హ్యాండ్ అంటూ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 11 రిలీజ్ కాబోతుంది.
ఈ టీజర్ చూస్తుంటే బస్తీల్లో ఉండే ఓ ఇద్దరు కుర్రాళ్లకు కాలేజీలో బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం అవ్వడం, ఆమె వీళ్ళకు డబ్బులు ఇచ్చి శ్రీలంకకు వెళ్లి గ్యాంబ్లింగ్ లో డబులు సంపాదించమని చెప్పడం, అక్కడికి వెళ్ళాక వీళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి.. అనే కథాంశంతో సినిమా ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా పాకెట్ రాకెట్స్ టీజర్ చూసేయండి..
టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ఈ సినిమా జులైలో ప్రారంభించాం. రుద్రతో ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. అంజి, ఏసు, జేడీ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా సినిమా రాబోతోంది అని తెలిపారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. పాకెట్ రాకెట్స్ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు అని అన్నారు.
నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. మేం డిజిటల్ కంటెంట్ చేసేవాళ్లం. మాకు ఇదే మొదటి సినిమా. నిహారిక గారితో మేం కలిసి ఈ సినిమాని నిర్మించాం. పాకెట్లో ఉన్న ఫోన్ తీసి తీయకుండా రెండు గంటల సేపు పాకెట్ రాకెట్స్ సినిమా చూస్తారు అని అన్నారు. దర్శకుడు రుద్ర అత్రి మాట్లాడుతూ.. టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. నా టీం ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమాని ఇంత వేగంగా పూర్తి చేయగలిగాను అని తెలిపారు.

త్రినాథ వర్మ మాట్లాడుతూ.. జీవితాన్ని మార్చుకోవాలని, అవకాశం రావాలని తపన పడే కుర్రాడి పాత్ర. నా జీవితంలోని పాత్రకు కనెక్ట్ అయ్యాను. నన్ను మళ్లీ హీరోగా నిలబెట్టిన నిహారిక గారు, మన్యం రమేష్ గారికి థాంక్స్. ఇద్దరు కుర్రాళ్లు తమ జీవితాల్ని బాగు పర్చుకునేందుకు ఏం చేశారు అన్నది ఈ సినిమాలో చూపించాం అని తెలిపారు. నిర్మల్ మాట్లాడుతూ.. పాకెట్ రాకెట్స్’ నాకు మొదటి సినిమా. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిహారిక గారు, రుద్ర గారికి థాంక్స్ అని తెలిపారు. శ్రియా కొంతం మాట్లాడుతూ.. పాకెట్ రాకెట్స్ సినిమా నా హారిక అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా టీజర్‌కి పది రెట్లు ఉంటుంది అని తెలిపింది.
