ప్యాకెట్‌లో నూనెను కింద పడకుండా బాటిల్‌లో పోయగలరా..! హీరోయిన్ షేర్ చేసిన వీడియో వైరల్
ప్యాకెట్ నుండి బాటిల్ లో నూనె పోయడం ఎలాగో గజిబిజి లేకుండా వీడియోలో చూడవచ్చు. ఒక గరిటె తీసుకొని దానిని ..
- Harishth Thanniru
- Published On : July 16, 2024 / 02:39 PM IST
video shows a woman pouring oil
Mucherla Aruna : సోషల్ మీడియాలో కొన్నిరకాల వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వంటగదికి సంబంధించిన చిట్కాలతో కూడిన వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తుంటారు. తాజాగా ఒకప్పటి తెలుగు హీరోయిన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వంటగదిలో నూనె ప్యాకెట్ నుంచి నూనెను బాటిల్ లో పోసే క్రమంలో నూనె కిందపడటం సర్వసాధారంగా జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా ప్రయత్నించినా నూనె చుక్కలు కింద పడిపోతుంటాయి. అయితే, నూనె ప్యాకెట్ నుంచి బాటిల్ లోకి నూనెను పోసే సమయంలో చిన్నచిట్కా పాటించి నూనె చుక్కలు కిందపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ఈ వీడియోలో చూపించారు.
Also Read : పెరిగిపోతున్న పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి ఎంత పెడుతున్నారో తెలుసా.. రోల్డ్ గోల్డ్‌తో కానిచ్చేస్తున్నారా?
పాతతరం తెలుగు హీరోయిన్ లలో ముచ్చర్ల అరుణ ఒకరు. ఆమె తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేశారు. శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్, సంసారం ఒక చదరంగం వంటి పలు సినిమాలతోపాటు 70కిపైగా సినిమాల్లో ఆమె నటించారు. ఆమె వివాహం తరువాత గృహిణిగా ఉంటున్నారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వంటలకు సంబంధించి వీడియోలతోపాటు జిమ్ లో వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా నూనె కిందపడకుండా చిన్న చిట్కాతో బాటిల్ లో పోయడం ఎలా అనే వీడియోను షేర్ చేశారు.
Also Read : Rohit Sharma : ఓరీ నాయనో.. ఎంత చక్కగా రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారో చూశారా..?
ప్యాకెట్ నుండి బాటిల్ లో నూనె పోయడం ఎలాగో గజిబిజి లేకుండా వీడియోలో చూడవచ్చు. ఒక గరిటె తీసుకొని దానిని ఒక గాజు సీసాలో తలక్రిందులుగా ఉంచారు. నూనె ప్యాకెట్‌ను ఒక వైపు నుండి కత్తిరించారు. ఆపై నూనెను గాజు సీసాలో పోశారు. ఈ క్రమంలో ప్యాకెట్ లోని నూనె కిందపడకుండా సీసాలో పోయడం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. మా అమ్మను ఆకట్టుకోవడానికి వంటగదిలో నేను దీన్ని చేయబోతున్నాను… ఐడియా బాగుంది అని పేర్కొన్నాడు. మరో నెటిజన్.. ఇది మంచి చిట్కా.. అంటూ పేర్కొన్నాడు.
