Rohit Sharma : ఓరీ నాయనో.. ఎంత చక్కగా రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారో చూశారా..?
టీ20 ప్రపంచకప్ సాధించి మంచి జోష్‌లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడు.
Rohit Sharma Telugu : టీ20 ప్రపంచకప్ సాధించి మంచి జోష్‌లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొట్టి ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. డల్లాస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్లు ఉండడంతో వారిని ఉద్దేశించి రోహిత్ కాసేపు తెలుగులో మాట్లాడాడు.
స్టేజీపై రోహిత్ శర్మ ఉండగా.. ఓ వ్యక్తి తెలుగులో ఎలా ఉన్నారు అని అడిగారు. అతడి మాటలు విన్న రోహిత్ ఎట్లా ఉన్నారు? అని అడిగాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. తెలుగు ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Shubman Gill : నక్కతోక తొక్కిన శుభ్‌మన్ గిల్.. ఒక్క సిరీస్‌తోనే..
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు తెలుగు బాగా వచ్చునన్న సంగతి తెలిసిందే. రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ ది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కాగా.. తండ్రి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మరాఠీయే రోహిత్‌కు మాతృభాష అయినప్పటికీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో కూడా రోహిత్ చాలా బాగా మాట్లాడగలడు.
ఇప్పటికే టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్టేలు, టెస్టుల్లో మరికొంత కాలం పాటు కొనసాగుతానని చెప్పాడు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ 2025తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచుల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుందని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశాడు.
Thomas Muller : ఫుట్‌బాల్ అభిమానులకు షాక్.. జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ రిటైర్మెంట్..
Rohit Sharma speaking Telugu 😂❤️!!#RohitSharma𓃵 #indiancricket #TeamIndia #IndianCaptian #Hitman pic.twitter.com/AMMs38VlII
— Coz Cricket (@CozCricket) July 15, 2024