Thomas Muller : ఫుట్‌బాల్ అభిమానుల‌కు షాక్‌.. జర్మనీ దిగ్గ‌జ ఆట‌గాడు థామస్ ముల్లర్ రిటైర్‌మెంట్‌..

జ‌ర్మ‌నీ ఫుట్‌బాల్ దిగ్గ‌జం థామ‌స్ ముల్ల‌ర్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Thomas Muller : ఫుట్‌బాల్ అభిమానుల‌కు షాక్‌.. జర్మనీ దిగ్గ‌జ ఆట‌గాడు థామస్ ముల్లర్ రిటైర్‌మెంట్‌..

Thomas Muller announces retirement from international football

Thomas Muller retirement : జ‌ర్మ‌నీ ఫుట్‌బాల్ దిగ్గ‌జం థామ‌స్ ముల్ల‌ర్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్, 2104 ప్రపంచ కప్ విజేత అయిన ముల్లర్ సోమవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు వీడ్కోలు ప‌లుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. 2010లో అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగ్రేటం చేసిన ముల్ల‌ర్.. జ‌ర్మ‌నీ త‌రుపున 131 మ్యాచులు ఆడాడు. 45 గోల్స్ చేశాడు. 2014 ప్ర‌పంచ‌క‌ప్‌ను జ‌ర్మ‌నీ సాధించ‌డంలో 34 ఏళ్ల ఈ ఆట‌గాడు కీల‌క పాత్ర పోషించాడు.

సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన యూరో చాంపియ‌న్ షిప్ 2024లో జ‌ర్మ‌నీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఓడిపోయింది. ఈ ఓట‌మిని అత‌డు జీర్ణించుకోలేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. దేశం త‌రుపున ఆడ‌డం త‌న‌కు ఎల్ల‌ప్పుడూ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ముల్ల‌ర్ చెప్పాడు. ఇంత‌కాలం త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ మాట్లాడుతుండ‌గా.. మిచెల్ స్టార్క్‌అంటూ నినాదాలు.. హిట్‌మ్యాన్ ఏమ‌న్నాడంటే..?

14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన‌ప్పుడు ఇంత‌కాలం త‌న కెరీర్ కొన‌సాగుతుంద‌ని ఊహించ‌లేద‌న్నాడు. 2026 ప్ర‌పంచ‌క‌ప్‌ను జ‌ర్మ‌నీ గెలుచుకోవాల‌ని ఆకాంక్షించాడు. ఈ క్ర‌మంలోనే యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇచ్చేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని భావించి త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్పాడు.

మార్చి 2010లో ముల్ల‌ర్ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగ్రేటం చేశాడు. అదే ఏడాది జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో 5 గోల్స్ సాధించ‌డంతో గోల్డ‌న్ బూట్‌ని అందుకున్నాడు. ఫిఫా యంగ్ ప్లేయ‌ర్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అత‌డి పేరు మారుమోగిపోయింది. ఇక 2014లో అత‌డి సార‌థ్యంలోనే జ‌ర్మ‌నీ ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ముల్ల‌ర్ ఐదు గోల్స్ చేశాడు. ఇందులో గ్రూప్ మ్యాచ్‌లో పోర్చుగ‌ల్ పై హ్యాట్రిక్ గోల్స్ న‌మోదు చేయ‌డం విశేషం. ముల్ల‌ర్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్ప‌డంతో ఓ శ‌కం ముగిసిన‌ట్లైంద‌ని ప‌లువురు ఫుట్‌బాల్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Shubman Gill : న‌క్క‌తోక తొక్కిన శుభ్‌మ‌న్ గిల్‌.. ఒక్క సిరీస్‌తోనే..

 

View this post on Instagram

 

A post shared by Thomas Müller (@esmuellert)