Gautam Gambhir : కోచ్‌గా తొలి మీడియా స‌మావేశం.. రోహిత్, కోహ్లీల‌ వ‌న్డే కెరీర్ గురించి గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు..

భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్న గౌత‌మ్ గంభీర్ మొద‌టి సారి మీడియా స‌మావేశంలో పాల్గొన్నాడు.

Rohit and Kohli can play until 2027 ODI World Cup Coach Gautam Gambhir

Coach Gautam Gambhir : భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్న గౌత‌మ్ గంభీర్ మొద‌టి సారి మీడియా స‌మావేశంలో పాల్గొన్నాడు. గంభీర్‌తో పాటు చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ కూడా హాజ‌రు అయ్యాడు. మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు గంభీర్ స‌మాధానాలు చెప్పాడు. అదే విధంగా త‌న విజ‌న్ ఏంటి అన్న విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

ప్ర‌పంచంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టును న‌డిపించేందుకు వ‌చ్చిన‌ట్లుగా గంభీర్ చెప్పాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌, డ‌బ్ల్యూటీసీ, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ర‌న్న‌ర‌ప్‌గా భార‌త్ నిలిచిన విష‌యాన్ని అత‌డు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించాడు. ప్ర‌స్తుత జ‌ట్టులో అంద‌రితో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషాతో మంచి అనుబంధం ఉంద‌న్నాడు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వాటి గురించి ప‌ట్టించుకోన‌ని చెప్పాడు.

Ajit Agarkar : మ‌రో రెండేళ్లు సూర్య‌నే కెప్టెన్‌..! హార్దిక్‌, జ‌డేజా ప‌రిస్థితిపై కీల‌క వ్యాఖ్య‌లు..

హెడ్ కోచ్‌గా నా బాధ్య‌త అదే..
జ‌ట్టులోని ప్ర‌తి ఆట‌గాడికి స్వేచ్ఛ ఇవ్వ‌డం ఎంతో కీల‌క‌మ‌ని గంభీర్ అన్నాడు. ప్ర‌తి ఒక్క ప్లేయ‌ర్‌పై న‌మ్మ‌కం ఉంచి వారిని ప్రోత్స‌హించ‌డమే హెడ్ కోచ్‌గా త‌న బాధ్య‌త‌ అని చెప్పాడు. సంతోషంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ త‌ప్ప‌కుండా విజ‌య‌వంతం అవుతుంద‌న్నాడు. తాను ఏ విష‌యాన్ని సంక్లిష్టం చేయ‌న‌న్నాడు. స‌హాయ సిబ్బంది ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌లైజ్ కాలేద‌న్నాడు. రైయ‌న్‌, అభిషేక్ నాయ‌ర్‌ల‌తో క‌లిసి ప‌ని చేశాను. ఆట‌గాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న‌ట్లుగా గంభీర్ చెప్పాడు.

రోహిత్, గంభీర్ వ‌న్డే కెరీర్ గురించి..
సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల వ‌న్డే కెరీర్‌పై విలేక‌రులు ప్ర‌శ్నించగా గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 వ‌ర‌కు రోహిత్‌, కోహ్లీ అందుబాటులో ఉంటార‌ని గంభీర్ చెప్పాడు. వాళ్లిద్ద‌రు గ‌నుక ఫిట్‌నెస్ కాపాడుకుంటే మాత్రం 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు జ‌ట్టులో కొన‌సాగుతార‌ని తెలిపాడు.

Richa Ghosh : రిష‌బ్ పంత్‌కు రిచా ఘోష్ షాక్‌..

కాగా.. ప్ర‌స్తుతం రోహిత్ వ‌య‌సు 37 ఏళ్ల‌, కోహ్లీ వ‌య‌సు 35 ఏళ్లు అన్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు