Richa Ghosh : రిష‌బ్ పంత్‌కు రిచా ఘోష్ షాక్‌..

శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024లో భారత మ‌హిళ‌ల జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Richa Ghosh : రిష‌బ్ పంత్‌కు రిచా ఘోష్ షాక్‌..

Richa Ghosh scripts history breaks Rishabh Pant record

Richa Ghosh-Rishabh Pant : శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024లో భారత మ‌హిళ‌ల జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఆదివారం దంబుల్లా వేదిక‌గా యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో 78 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా జ‌ట్టు వికెట్ కీప‌ర్ రిచా ఘోష్ చ‌రిత్ర సృష్టించింది. ఆసియా క‌ప్ చ‌రిత్ర‌లో అత్యంత పిన్న వ‌య‌సులో అర్థ‌శ‌త‌కం బాదిన టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో భార‌త పురుషుల జ‌ట్టు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించింది.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత పిన్న వ‌య‌సులో హాఫ్ సెంచ‌రీ చేసిన భార‌త వికెట్ కీప‌ర్‌గా రిచాఘోష్ రికార్డుల‌కు ఎక్కింది. రిష‌బ్ పంత్ 21 ఏళ్ల 206 రోజుల వ‌య‌సులో ఈ ఘ‌న‌త సాధించ‌గా, రిచా 20 ఏళ్ల 297 వ‌య‌సులోనే దీన్ని అందుకుంది.

Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన ష‌మీ..

ఈ మ్యాచ్‌లో రిచా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. 29 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 64 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌(66; 47 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), షెఫాలీ వ‌ర్మ (37; 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా 200 పైగా ప‌రుగులు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

అనంత‌రం భార‌త బౌల‌ర్లు విజృంభ‌ణ‌తో యూఏఈ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. యూఏఈ బ్యాట‌ర్ల‌లో ఈషా (38), కవిషా (40 నాటౌట్) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ రెండు వికెట్లు తీసింది. రేణుకా సింగ్‌, త‌నూజ‌, పూజా వ‌స్త్రాక‌ర్‌, రాధా యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్స్‌.. పాపం అంటున్న నెటిజ‌న్లు..

కాగా.. రెండు వ‌రుస విజ‌యాల‌తో భార‌త్ గ్రూపు ఏ లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం భార‌త ర‌న్‌రేటు +3.298గా ఉంది. గ్రూపులో త‌న చివ‌రి మ్యాచ్‌ను నేపాల్‌తో మంగ‌ళ‌వారం ఆడ‌నుంది.