RJ Surya : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ సూర్య.. పెళ్లి ఫోటోలు వైరల్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. (RJ Surya)
RJ Surya
RJ Surya : ఈ పెళ్లిళ్ల సీజన్ లో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవలే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ – రష్మిక, అల్లు శిరీష్ – నయనిక పెళ్లిళ్లు జరగ్గా తాజాగా ఆర్జే, నటుడు, మిమిక్రి ఆర్టిస్ట్, బిగ్ బాస్ ఫేమ్ సూర్య కూడా పెళ్లి చేసుకున్నాడు.
ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. BB జోడి సీజన్ 1 విన్నర్ గా కూడా నిలిచాడు సూర్య. ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా ట్రై చేస్తూనే ఆర్జేగా పనిచేస్తున్నాడు. ఇటీవల మార్చ్ 6న సూర్య మరో ఆర్జేని పెళ్లి చేసుకున్నాడు.
రెడ్ FM లో పనిచేస్తున్న ఆర్జే శౌర్య అనే అమ్మయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మార్చ్ 6న పెళ్లి చేసుకోగా నేడు శౌర్య తమ పెళ్లి ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. కేవలం బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం. దీంతో సూర్య – శౌర్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

