NTR Fans : మళ్ళీ రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొత్త హాస్పిటల్ డ్యామేజ్.. ఫ్యాన్స్ పై కర్ణాటక పోలీసులు లాఠీ ఛార్జ్..
దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. (NTR Fans)
NTR Fans
- బెంగుళూరులో ఎన్టీఆర్
- హాస్పిటల్ ఓపెనింగ్ లో ఎన్టీఆర్
- భారీగా హాజరయి రచ్చ చేసిన ఫ్యాన్స్
NTR Fans : ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నేడు ఎన్టీఆర్ బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడికి భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్టీఆర్ వ్యాన్ ని ఫాలో అయ్యారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూనే ఎన్టీఆర్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
అయితే ఫ్యాన్స్ ఎక్కువగా రావడం, కంట్రోల్ తప్పడం, కొంతమంది ఫ్యాన్స్ హడావిడి చేయడం, ఎన్టీఆర్ ని చూడాలనే ఆత్రంతో చుట్టూ ఏం పట్టించుకోకుండా కొంతమంది ఫ్యాన్స్ హాస్పిటల్ లోపలికి దూసుకెళ్లారు. ఈ సంఘటనలతో కొత్త హాస్పిటల్ లో ఎస్కలేటర్ విరిగిపోయింది. రిసెప్షన్ లో ఉన్న ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయింది. జనాలు కూడా కొంతమంది కింద పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో.. పవన్ ఫ్యాన్స్ కి షాక్.. పాపం
హాస్పిటల్ దగ్గర ఉన్న జనాన్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నించారు. దీంతో అక్కడి పోలీసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ ఛార్జ్ కూడా చేసారు. ఎన్టీఆర్ కూడా ఆ జనంలో ఇబ్బంది పడుతూనే ఎలాగోలా ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేసేసారు.
Bengaluruలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభానికి వచ్చిన N. T. Rama Rao Jr.ను చూడటానికి అభిమానులు భారీగా రావడంతో ఎస్కలేటర్ అద్దం పగిలింది. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు.#JrNTR #Bengaluru #NTRFans #Tollywood #BreakingNews #AndhraPradesh #YellowSingam pic.twitter.com/SyziNqHAoz
— Yellow Singam (@SingamYell21994) March 8, 2026
గతంలో దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పర్మిషన్లు, పాసులు లేకపోయినా భారీగా ఫ్యాన్స్ వచ్చి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ అద్దాలు పగలగొట్టి, కుర్చీలు విరగ్గొట్టి, ఈవెంట్ వద్ద రచ్చ రచ్చ చేసి హంగామా చేసారు. దాంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా రచ్చ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
Lathi charge on fans#NTRInBanglore@tarak9999 #NTRNeel pic.twitter.com/rVKnU83WpQ
— AndhraNTRFC (@AndhraNTRFC) March 8, 2026
